అక్రమ హోర్డింగ్స్‌పై జీహెచ్‌ఎంసీ కొరడా.. భారీగా జరిమానాల విధింపు

అక్రమ హోర్డింగ్స్‌పై జీహెచ్‌ఎంసీ కొరడా.. భారీగా జరిమానాల విధింపు

హైదరాబాద్‌లో అక్రమ హోర్డింగ్స్‌పై ఇప్పటికే పలుసార్లు హెచ్చరించిన ప్రభుత్వం.. ఇప్పుడు భారీ జరిమానాలు విధించింది. అక్రమ హోల్డింగ్స్ కు భారీ జరిమానాలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ).. అమీర్‌పేట్‌లోని చెన్నై షాపింగ్ మాల్‌కు రూ. 4 లక్షలు జరిమానా విధించిన జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం.. అమీర్‌పేట్‌లోని వీఆర్కే సిల్క్స్‌కు రూ.2లక్షల జరిమానా, ఎస్‌ఆర్‌ నగర్‌లోని బజాజ్‌ ఎలక్ర్టానిక్స్‌ కు రూ.లక్షా 50 వేల జరిమానా, అక్కడే రిలయన్స్ డిజిటల్‌కు కూడా రూ. లక్ష జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక, లక్డికాపూల్‌లోని ఇంపీరియల్ రెస్టారెంట్‌కు రూ. లక్ష జరిమానా విధించింది జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం. దీంతో.. అక్రమ హోర్డింగ్‌లపై మిగతా వారికి వార్నింగ్ ఇచ్చినట్టు అయ్యింది. గతంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులను కూడా జీహెచ్‌ఎంసీ తొలగించిన సంగతి తెలిసిందే.