గ్రేటర్ ఫలితాలు.. ఇప్పటి వరకు ఎవరికి ఎన్నంటే..?

గ్రేటర్ ఫలితాలు.. ఇప్పటి వరకు ఎవరికి ఎన్నంటే..?

గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి... అధికార టీఆర్ఎస్ పార్టీకి గతంలో కంటే సీట్లు తగ్గినా సంపూర్ణ మెజార్టీ వైపు దూసుకెళ్తుండగా... ఎంఐఎం మరోసారి తన పట్టు నిలుపుకుంది.. ఇక, బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది... కొన్ని స్థానాల్లో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య టప్ ఫైట్ నడుస్తోంది.. మరోవైపు.. కాంగ్రెస్ మూడు నాలుగు స్థానాలకే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఆధిక్యాల సంఖ్య ఎలా ఉన్నా ఇప్పటి వరకు 82 స్థానాల్లో విజయం సాధించిన అభ్యర్థుల పేర్లను ప్రకటించారు అధికారులు.. వాటిలో 32 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా.. ఎంఐఎం అభ్యర్థులు 31 స్థానాల్లో గెలుపొందారు. ఇక, 17 స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకోగా... కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు 39 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు టీఆర్ఎస్ అభ్యర్థులు.. బీజేపీ 17 చోట్ల లీడ్‌లో ఉండగా.. కాంగ్రెస్ ఒకచోట, ఎంఐఎం 8 చోట్ల ఆధిక్యంలో ఉంది.