టీడీపీకి భారీ షాక్..! బీజేపీ గూటికి గంటా..? ఇద్దరు ఎమ్మెల్యేలు..!?

టీడీపీకి భారీ షాక్..! బీజేపీ గూటికి గంటా..? ఇద్దరు ఎమ్మెల్యేలు..!?

ఏపీలో టీడీపీకి మరో షాక్ తగలబోతోందా? మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరుతున్నారా? మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఆయన బాటలోనే పయనించటానికి సిద్ధమయ్యారా? అనే చర్చ ఊపందుకుంది. మాజీ మంత్రి, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు తెలుగుదేశం పార్టీని వీడే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గంటా టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఢిల్లీలోనే ఆయన మకాం వేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. గంటా హస్తినలో బీజేపీ ముఖ్యనేత రాంమాధవ్‌తో సమావేశమైనట్లుగా తెలుస్తోంది.. రాంమాధవ్‌ను కలిసిన గంటా.. బీజేపీలో చేరేందుకు సంసిద్దత వ్యక్తం చేసినట్లు సమాచారం. రెండు రోజుల నుంచి రాజ్యసభ సభ్యులు... టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్‌తో గంటా చర్చలు జరిపారని సమాచారం. 

మరోవైపు...గంటాతో పాటు బీజేపీలోకి వచ్చేందుకు మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరితో ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మంతనాలు సాగించినట్లు సమాచారం. గంటా వైసీపీలోకి కాకుండా బీజేపీలోనే చేరటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు సాక్ష్యంగా చెప్పుకోవచ్చు.  మొత్తానికి...గంటా టీడీపీని వీడుతున్నట్లుగానే భావించాల్సి ఉంటుందని విశాఖకు చెందిన సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.