కోహ్లీ వికెట్ చాలా ప్రత్యేకం: సందీప్ శర్మ

కోహ్లీ వికెట్ చాలా ప్రత్యేకం: సందీప్ శర్మ

షార్జా: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ సందీప్ శర్మ మరోసారీ ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టాడు. విరాట్ కొహ్లీ తన వికెట్‌ను సందీప్‌ బౌలింగ్‌లో కోల్పోవడం ఏడోసారి. దానిపై స్పందించిన సందీప్ కోహ్లీ వికెట్ తనకు ఎంతో ప్రత్యేకమని అన్నాడు. అయితే 12 మ్యచ్‌లలో సందీప్‌ను ఎదుర్కొన్న కోహ్లీ కేవలం 139 స్ట్రైక్ రేట్‌తో 68పరుగులు మాత్రమే చేయగలిగాడు. ‘నేను బౌలింగ్ మొదలుపెట్టిన సమయంలో వికెట్ తీయడం నాకు చాలా కష్టంగా ఉండేది. అందుకే నేను ప్రతి వికెట్ విడివిడిగా స్వింగ్ చేస్తూ బౌలింగ్ చేస్తాను. అయితే ఇప్పుడు బంతి బాగా స్వింగ్ అవుతుంది. అంతేకాకుండా నేను ఎక్కువ నకల్‌బాల్స్ వేస్తున్నాను, అందుకు బెయిర్‌స్ట్రో ఎంతగానో సహాయం చేశాడ ’ని సందీప్ తన బౌలింగ్ గురించి చెప్పాడు. ‘కోహ్లీ ఎంతో గొప్ప ఆటగాడు. ప్రపంచ మేటి ఆటగాళ్ళ జాబితాలో ఉంటాడు. దానికి తోడు టీమ్ ఇండియాకు కెప్టెన్. అలాంటీ కోహ్లీ వికెట్ పడగొట్టడం నాకు ఎప్పుడూ ప్రత్యేకమే’అని సందీప్ స్పందించాడు. శనివారం ఆర్‌సీబీపై గెలవడంతో ఎస్ఆర్‌హెచ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానికి చేరుకుంది. ఆర్‌సీబీ 14 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఎస్ఆర్‌హెచ్ తరువాత ముంబై ఇండియన్స్ తలపడేందుకు సిద్దమవుతుంది. ఈ మ్యాచ్ నవంబర్ 3న షార్జా వేదికగా జరగనుంది.