కొత్త ఉద్యోగం: బిస్కెట్ రుచి చూస్తే చాలు... జీతం ఎంతో తెలుసా? 

కొత్త ఉద్యోగం: బిస్కెట్ రుచి చూస్తే చాలు... జీతం ఎంతో తెలుసా? 

కరోనా తరువాత ప్రపంచంలో కొత్త కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నారు.  ప్రపంచం కొత్త కొత్త రుచులకు అలవాటు పడుతున్నది.  సాంప్రదాయ రుచులతో పాటుగా కొత్త రుచులను ప్రపంచానికి అందించగలిగితే వినియోగదారులను ఆకర్షించవచ్చు.  ఇందుకోసం కంపెనీలు లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నాయి.  టీ పరిశ్రమల్లో టెస్ట్ బడ్స్ పేరుతో ఇప్పటికే ఉద్యోగాలు ఉన్న సంగతి తెలిసిందే.  ఇటీవలే నూడిల్స్ ప్రముఖ నూడిల్స్ సంస్థ టాప్ రామెన్ నూడిల్స్ చీఫ్ నూడిల్స్ ఆఫీసర్ పోస్ట్ ను క్రియేట్ చేసింది.  

ఇక ఇదిలా ఉంటె, యూకే కు చెందిన స్కాటిష్ బిస్కెట్ సంస్థ బోర్డర్ బిస్కెట్స్  ఓ కొత్త ఉద్యోగాన్ని క్రియేట్ చేసింది.  ప్రపంచానికి మంచి రుచికరమైన బిస్కెట్లు అందించేందుకు బిస్కెట్ టెస్టర్ జాబ్ ను క్రియేట్ చేసింది.  కొత్త కొత్త బిస్కెట్లు రుచి చేసి దాని గురించి రివ్యూ చెప్తే చాలు.  ఈ ఉద్యోగానికి నెలకు రూ.3 లక్షల జీతం అందిస్తామని చెప్పింది.  సంవత్సరంలో 35 రోజుల సెలవులను కూడా ఇస్తామని కంపెనీ ప్రకటించింది.