జర్మనీలో భారీగా పెరిగిన కరోనా కేసులు..ఎన్నంటే..

జర్మనీలో భారీగా పెరిగిన కరోనా కేసులు..ఎన్నంటే..

బెర్లిన్: ప్రపంచం అంతా కరోనా పంజాల కింద నలిగిపోతోంది. గుండెలు గుప్పెట్లో పెట్టుకొని గడపాల్సిన సరిస్థితిలో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. దేవాలలో రోజురోజు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే జర్మనీలో ఇప్పటికి నమోదైన కరోనా కేసులు 961,320గా ఉంది. గత 24 గంటల్లో 18,633 కేసులు నమోదయ్యాయి. దేశమంతటా కరోనా విజృంభించడంతో దేశ కౌన్సిలర్ ఎంజెలా మార్కెల్ మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం నడుస్తున్న లాక్‌డౌన్ మరికొన్నాళ్లు కొనసాగుతుందని తెలిపారు. అంతేకాకుండా ప్రజలు ఎటువంటి నిర్లక్ష్యం చేయవద్దని, మాస్క్ తప్పని సరిగి ధరించమనీ చెప్పారు. దీంతోపాటుగా వ్యాపారాల్లో కూడా కరోనా కారణంగా భారీగా నష్టాలు వస్తున్నాయని, జర్మనీ ఆర్థికంగా కూడా దెబ్బ తిన్నదని అన్నారు. దీనినుంచి ఎలాగైనా కలిసి బయట పడాలని ప్రజలకు ధైర్యం చెప్పారు.