భారీగా పెరిగిన కరోనా కేసులు..ఎన్నంటే..

భారీగా పెరిగిన కరోనా కేసులు..ఎన్నంటే..

బెర్లిన్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకు పెరిగిపోతున్న కేసులతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచ దేశాలు ఎంత ముమ్మరం చేసినా లాభం కనిపించడం లేదు. ఇటీవల జర్మనీలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఒక్కరోజులో 33,777 కేసులను నమోదు చేసి దేశంలో ఇప్పటి వరకు నమోదయిన అత్యదిక ఒక్కరోజు కేసులుగా నమోదయింది. దీంతో దేశంలో ఇప్పటికి నమోదయిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,439,938కి చేరింది. దాంతో పాటుగా గత 24 గంటల్లో 813 మంది మరణించారు. ఈ మరణాలతో దేశంలోని మరణాల సంఖ్య 24,938కి ఎగబాకింది. అదే రీతిలో కోలుకున్నవారి సంఖ్య కూడా పెరగడం శుభ వార్తుగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కలోకున్న వారి సంఖ్య దాదాపు 1.06మిలియన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో కరోనా విజృంభనను అరికట్టేందుక జర్మనీ ప్రభుత్వం ఈ నెల 16 నుంచి జనవరీ 10 వరకు లాక్‌డౌన్‌ను ప్రకటించింది. అంతేకాకుండా కరోనా నిబంధనలను ఉల్లఘించిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.