మాస్క్ మర్చిపోయిన జర్మనీ ఛాన్సలర్... వైరల్
ప్రపంచంలో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనాను కంట్రోల్ చేయాలి అంటే తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. మాస్క్ ధరించడం వలన కొంతవరకు కరోనా వైరస్ ను కంట్రోల్ చెయ్యొచ్చని వైద్యనిపుణులు చెప్తున్న సంగతి తెలిసిందే. ఇక దేశాధినేతలు సైతం మాస్క్ పై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మాస్క్ ధరించడం, డిస్టెన్స్ పాటించడం, శానిటేషన్ విధిగా వాడటం, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం వంటివి చేయకూడదు. వీటిని ప్రపంచంలోని ప్రముఖులంతా ప్రచారం చేస్తున్నారు. ఇక కరోనా పోరాటం విషయంలో జర్మనీ సైతం ముందు వరసలో ఉన్నది. జర్మనీ ఛాన్సలర్ మోర్కెల్ అనేక కఠిన నిర్ణయాలు తీసుకొని దేశంలో కరోనాను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, జర్మనీ పార్లమెంట్ లో ఇటీవల ఓ సంఘటన జరిగింది. ఛాన్సలర్ మోర్కెల్ ప్రసంగించిన తరువాత వచ్చి తన స్థానంలో కూర్చున్నారు. అయితే, ఆమె తన మాస్క్ ను ప్రసంగించిన చోట మర్చిపోయారు. కూర్చున్న వెంటనే మాస్క్ గుర్తుకు రావడంతో పరుగున లేచి వెళ్లి తెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన చిన్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)