కరోనాకు యాంటీబాడీ కాక్ టైల్ తో చికిత్స 

కరోనాకు యాంటీబాడీ కాక్ టైల్ తో చికిత్స 

యూరప్ లో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.  కరోనా కేసులు పెద్ద మొత్తంలో నమోదవుతుండటంతో యూరప్ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్ లో లాక్ డౌన్ అమలౌతున్నది. జులై 17 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది.  ఇక ఇదిలా ఉంటె, అమెరికా నుంచి జర్మనీ 2 లక్షల యాంటీబాడీ కాక్ టైల్ డోసులను దిగుమతి చేసుకుంది.  ఈ విషయాన్ని జర్మనీ ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది.  ఒక్కో కాక్ టైల్ డోస్ ను రూ.1.7 లక్షలు చెల్లించి 2 లక్షల డోసులను దిగుమతి చేసుకుంది.  ఈ డీల్ విలువ రూ.3,555 కోట్ల రూపాయలు.  అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కరోనా బారిన పడిన సమయంలో ఆయనకు యాంటీబాడీ కాక్ టైల్ డోసులతో చికిత్స అందించారు. కరోనాకు ఈ కాక్ టైల్ డోసులు బాగా పనిచేస్తాయనే నమ్మకంతో జర్మనీ ఆరోగ్యశాఖ వీటిని ఆర్డర్ చేసింది.