సెకండ్ వేవ్ ఎఫెక్ట్: జర్మనీ, ఫ్రాన్స్ లో లాక్ డౌన్...
ప్రపంచంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మరలా విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా యూరప్ దేశాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. యూరప్ లో రోజు రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. అత్యధిక కేసులతో పాటుగా ఆ దేశాల్లో మరణాల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు లాక్ డౌన్ ను విధించాలని నిర్ణయించాయి. కొద్దిసేపటి క్రితమే ఈ రెండు దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. నాలుగు వారాలపాటు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించినా లాభం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)