బామ్మా డ్యాన్స్ కు టిక్ టాక్ ఫిదా... 

బామ్మా డ్యాన్స్ కు టిక్ టాక్ ఫిదా... 

కరోనా కాలంలో ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో కొత్త కొత్త ఆలోచనలు చేసిన వ్యక్తులు కరోనా తరువాత పాపులర్ అవుతూ వస్తున్నారు.  పాపులర్ కావడానికి వయసుతో సంబంధం లేదు.  గెలవాలనే తపన ఉంటె చాలు.  జర్మనీకి చెందిన 81 సంవత్సరాల ఎరికా రిష్కో కరోనా సమయంలో బాగా పాపులర్ అయ్యారు. కరోనా కారణంగా ఇంట్లోనే ఉండిపోవడంతో, ఆ సమయంలో సరదాగా టిక్ టాక్ వీడియో చేసింది.  ఫిట్ నెస్ కు సంబంధించిన వీడియో కావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  వీడియోలకు మంచి రెస్పాన్స్ రావడంతో వరసగా వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు బామ్మా ఎరికా టిక్ టాక్ సంచలనంగా మారింది.  ఫిట్ నెస్ వీడియోలతో పాటుగా అప్పుడప్పుడు తన భర్తతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోలను కూడా పోస్ట్ చేస్తున్నారు.  టిక్ టాక్ లో ఆమెకు అక్షరాలా 1.25 లక్షల ఫాలోవర్లు ఉన్నారు.  ఊరికే కూర్చోకుండా ఏదోఒకటి చేయండి అంటోంది బామ్మా.