అమ్మకానికి జర్మనీ నియంత హిట్లర్ టాయిలెట్ సీట్... ధర ఎంతో తెలుసా?

అమ్మకానికి జర్మనీ నియంత హిట్లర్ టాయిలెట్ సీట్... ధర ఎంతో తెలుసా?

రెండో ప్రపంచ యుద్ధం కాలంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో జర్మనీ నియంత హిట్లర్ కూడా ఒకరు.  యుద్ధం ముగిసే సమయంలో హిట్లర్ తనను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  అయితే, హిట్లర్ రహస్య స్థావరంలో ఉన్నప్పుడు తన గదిలో ఓ టాయిలెట్ ఉండేది.  ఆ టాయిలెట్ సీట్ ను రాంగ్ వాల్డ్ సి బోర్చ్ అనే అమెరికన్ సైనికుడు ఎత్తుకెళ్లాడు.  రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీని అమెరికన్ సైనికులు చుట్టుముట్టిన సమయంలో సైనికుడు ఆ టాయిలెట్ సీట్ ను దొంగిలించాడు.  ఆ తరువాత అక్కడి నుంచి దానిని న్యూయార్క్ లోని తన ఇంటికి తీసుకెళ్లాడు.  ఇప్పటి వరకు ఆ సీట్ తన వద్దే ఉంచుకున్నారు.  కాగా, ఇప్పుడు దానిని అయన కుటుంబసభ్యులు వేలం వేయబోతున్నారు.  వేలంలో ప్రారంభ ధారగా 5000 డాలర్లుగా నిర్ణయించారట.  వచ్చేవారం ఈ టాయిలెట్ సీట్ ను వేలం వేస్తారు.  దాదాపుగా 15000 డాలర్లకు ఈ టాయిలెట్ సీట్ అమ్ముడయ్యే అవకాశం ఉన్నట్టు వేలం నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.