ఐపీఎల్ లో రోహిత్ ఏ బెస్ట్ కెప్టెన్ : గౌతమ్ గంభీర్

ఐపీఎల్ లో రోహిత్ ఏ బెస్ట్ కెప్టెన్ : గౌతమ్ గంభీర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉత్తమ కెప్టెన్‌ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నారు. అతని నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు నాలుగు ట్రోఫీలతో ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా మారింది. కెప్టెన్సీ అంటే ట్రోఫీలను గెలుచుకోవడమే అని తెలిపాడు. అతను అత్యంత విజయవంతమైన ఐపీఎల్ కెప్టెన్ గా తన కెరియర్ ముగిస్తాడు. అతను ఇప్పటికే 4 టైటిళ్లు  కలిగి ఉన్నాడు, ఇంకా 3  టైటిళ్లు  గెలుస్తాడు దాంతో 6-7 ట్రోఫీలతో రోహిత్ ఐపీఎల్ ముగించవచ్చు" అని గంభీర్ చెప్పాడు. అయితే ఈ రోజు స్టార్ స్పోర్ట్స్ నిపుణుల జ్యూరీ ధోని, రోహిత్ శర్మలను సంయుక్తంగా ఐపీఎల్ యొక్క బెస్ట్ కెప్టెన్లుగా ఎంపిక చేసింది. అయితే ఇప్పుడు గంభీర్  ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఏ ఉదేశ్యం ఉందొ మాత్రం తెలియదు. అయితే గంభీర్  చేసిన వ్యాఖ్యలను బట్టి ధోని కంటే రోహిత్ ఏ బెస్ట్ కెప్టెన్ అని తెలుస్తుంది అంటున్నారు కొంత మంది క్రికెట్ అభిమానులు.