కేకేఆర్ యాజమాన్యం చేసింది తప్పు : గంభీర్

కేకేఆర్ యాజమాన్యం చేసింది తప్పు : గంభీర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్లో కోల్‌కత నైట్ రైడర్స్ తమ జట్టు కెప్టెన్ గా దినేష్ కార్తీక్ ను తప్పించి ఇయాన్ మోర్గాన్ కు ఆ బాధ్యతలు అప్పగించాలి అని ఫ్రాంచైజ్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ జట్టుకు రెండుసార్లు టైటిల్ అందించిన మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఖండించారు. కార్తీక్ ఈ సీజన్‌లో 7 మ్యాచ్ లలో జట్టును ముందుండి నడిపించాడు. అందులో అతను 4 గెలిపించి 3 ఓడిపోయాడు. కానీ ఇప్పడు బ్యాటింగ్‌ పై దృష్టి పెట్టడానికి కార్తీక్ తన కెప్టెన్ పదవిని వదులుకున్నాడు. కేకేఆర్ యాజమాన్యం కూడా దానికి ఒప్పుకుంది. కానీ అది కరెక్ట్ కాదు అని గంభీర్ అన్నాడు. మోర్గాన్ కెప్టెన్ గా జట్టును మార్చగలడని నేను అనుకోను. ఒకవేళ అతను టోర్నమెంట్ ప్రారంభం నుండి కెప్టెన్‌గా ఉంటే మార్చగలిగేవాడు కావచ్చు. కానీ టోర్నమెంట్ మధ్యలో కెప్టెన్ అయితే అది కష్టం అని గంభీర్ తెలిపాడు. ఇక కేకేఆర్ నిన్న ముంబై ఇండియన్స్ పై ఆడిన మ్యాచ్ లో ఓడిపోవడంతో కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌ లో పరాజయం పాలయ్యాడు మోర్గాన్.