ధోని పై ప్రశంసల జల్లు కురిపించిన గంభీర్...

ధోని పై ప్రశంసల జల్లు కురిపించిన గంభీర్...

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ప్రశంసల జల్లు కురిపించాడు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. ఐపీఎల్ 2021 రిటెన్షన్ జాబితాలపై స్పందిస్తూ ఈ మాజీ కెప్టెన్ ‌ను గంభీర్ ఆకాశానికెత్తాడు. గత సీజన్‌లో దారుణ ప్రదర్శన కనబర్చిన చెన్నై పెద్దగా మార్పులు చేయలేదన్నాడు. ఇది ధోనీ ప్రత్యేకతని, అదే చెన్నై సూపర్ కింగ్స్‌ సక్సెస్‌కు కారణమని కొనియాడాడు. ఐపీఎల్ 2021 మినీ వేలం కోసం సిద్దమవుతున్న ఫ్రాంచైజీలు రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యధికంగా 10 మంది ఆటగాళ్లను విడుదల చేయగా గత సీజన్‌లో దారుణ ప్రదర్శన కనబర్చిన సీఎస్‌కే కూడా కేవలం  ఐదుగురు ఆటగాళ్లనే వదులుకుంది. ఈ విషయాన్నే ప్రస్తావించిన గంభీర్.. సీఎస్‌కే నిర్ణయాన్ని కొనియాడుతూ.. ఆర్‌సీబీ తీరును తప్పుబట్టాడు. సీఎస్‌కే చెత్త ప్రదర్శన కనబర్చిందని, జట్టు మొత్తం మార్చాల్సిన అవసరం ఉందని చాలా మంది అన్నారు. కానీ వాళ్లు మాత్రం కేవలం ఐదుగురిని మాత్రమే వదులుకున్నారు. మరోవైపు ఆర్‌సీబీ మాత్రం ప్లే ఆఫ్స్ చేరి కూడా పది మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది.పేలవ సీజన్ తర్వాత కూడా సీఎస్‌కే ఆటగాళ్లపై విశ్వాసం కనబరుస్తూ మద్దతుగా నిలిచింది. కానీ ఆర్‌సీబీ అలా కాదు'అని గంభీర్ పేర్కొన్నాడు.