గంటా శ్రీనివాస్ స్పీడుకు బ్రేకులు వేస్తున్న మేనల్లుడు?

గంటా శ్రీనివాస్ స్పీడుకు బ్రేకులు వేస్తున్న మేనల్లుడు?
గంటా శ్రీనివాసరావు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. రెండు సార్లు మంత్రి. రాజకీయ ఎత్తుగడలు వేయడంలో ఆయనకు ఆయనే సాటి. అంతటి గంటాకు ఇప్పుడు రాజకీయంగా ఎదురుగాలి వీస్తోంది. ప్రతిపక్షంలో వు న్న ఆయన అధికార పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. అంతా అనుకున్నట్టే జరుగుతు
న్న సమయంలో ప్రత్యర్ధులకు ఆయుధం దొరికేసింది. గంటా మేనల్లుడు, ప్రస్తుతం ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిక్కాల విజయ సారధి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. 2014 నుంచి 2019వరకు గంటా భీమునిపట్టం ఎమ్మెల్యే. 

ఆ ఐదేళ్లు అక్కడ విజయ్ హవానే నడిచింది. ఈ సమయంలోనే విజయ్, అతని అనుచరులు నడిపిన వ్యవహారాల ను ఇప్పుడు అధికారపార్టీ ఆధారాలతో సహా తవ్వితీస్తోంది. తీగలాగి డొంకను కదిలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మధురవాడలోని వికలాంగుల కాల నీ భూముల వ్యవహారం వెలుగులో నికి వచ్చింది. సర్వే నెం 336లో  ప్రభుత్వం దివ్యాంగులకు పట్టాలు మంజూరు చేసింది. తమకు కేటాయించిన స్థలాల్లో కొందరు లబ్ధిదారులు ఇళ్ళు నిర్మించుకున్నారు.  

ఆర్థిక స్తోమత లేకపోవడంతో కొందరు స్థలాలు ఖాళీగా ఉండిపోయాయి. ప్రస్తుతం ఇక్కడ గజం ధర 25 వేలు పలుకుతుండగా...ఈ ఆస్తులను విజయ్ అండ్ కో అండతో కొందరు కబ్జాదారులు తప్పుడు పత్రాలతో అక్రమించినట్టు అధికారుల దృష్టికి వచ్చింది. వాటి ఆధారంగా ఐదేళ్ల కాలంలో చోటు చేసుకున్న వ్యవహారాలపై ఓ తహాశీల్ధార్ స్థాయి అధికారితో రహస్య విచారణ జరిపించినట్టు వినికిడి. గంటా మేనల్లుడు కారు డ్రైవర్, మరికొందరు స్థానిక నాయకులతో కలిసి ఈ స్థలాలను అక్రమించినట్టు రూరల్ తహాశీల్ధార్ నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీని ఆధారంగా ముగ్గురుపై కేసు నమోదు చేసిన పిఎం పాలెం పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. స్థలాల ఆక్రమణ వ్యవహారం వెలుగులోకి రావడంతో మరికొంత మంది లబ్ధిదారులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. ఇది ఒక్కటే కాదు హుధుద్ హౌసింగ్, ఉద్యోగం ఇప్పిస్తానని తనను విజయ్ మోసగించాడని సూర్యనారాయణ అనే యువకుడు ఎం.వీ.పీ. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అలాగే, ఓజోన్ వ్యాలీ,సైబర్ వ్యాలీ వంటి చోట్ల ఖరీదైన భూములను స్వాధీనం చేసుకుని కోట్లకు పడగలెత్తరనేది బలమైన ఆరోపణ. 

ప్రస్తుత పరిస్థితుల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనిచేసిన వ్యక్తుల పేరులు ప్రచారంలోకి రావడం గంటా వర్గీయులకు ఇబ్బందికరంగానే ఉంది. వాస్తవానికి ఇలాంటి వ్యవహారాలను గంటా ప్రోత్సహించరనేది సన్నిహితుల అభిప్రాయం. కానీ, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్నట్టు ఇన్ఛార్జ్ లు నడిపించిన వ్యవహారాలు రాజకీయంగా గంటాకు ఇబ్బందిగా పరిణమిస్తున్నాయని వాపోతున్నారు. మరోవైపు, గంటా ఒకప్పుడు డైరెక్టర్ గా పని చేసిన ప్రత్యూష షిప్పింగ్ కంపెనీ ఇండియన్ బ్యాంకు నుంచి పొందిన లోన్లు వ్యవహారం నలుగుతొంది. 

ప్రభుత్వ భూమిని~కుదవపెట్టి కోట్ల రూపాయల రుణం తీసుకున్నారనేది ఆరోపణ. ఈ వ్యవహారాలతో తనకు ఎటువంటి సంబందం లేదని గంటా ప్రకటించారు. ఐతే, భీమిలి ప్రాంతంలో భూముల వ్యవహారంలో బయటపడడం...అందులో ఇన్ ఛార్జ్ విజయ్ అనుచరులు ప్రమేయం వెలుగు చూడ్డంతో ప్రత్యర్ధులు వేలెత్తి చూపిస్తున్నారు. ఇప్పటికే విశాఖ ల్యాండ్ స్కామ్ లో ఆరోపణలు ఉన్నాయి. భీమిలి కేంద్రంగా జరిగిన రికార్డుల ట్యాపరింగపై ప్రస్తుత ప్రభుత్వం వేసిన సిట్ తన పని పూర్తి చేసింది. 

మరోవైపు, భూముల అక్రమాల్లో అరెస్టుకు భయపడే గంటా వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. ఈ అవరోధాలను దాటుకుని లైన్ క్లియర్ చేసుకుంటే మేనల్లుడు కోటరీ గిల్లుడు వ్యవహారాలు చర్చనీయాంశంగా మారాయి. ఏడాది వైసీపీ పాలనలో ఒక్క గజం కూడా కబ్జాకు గురికాకుండా కాపలా కాస్తున్నామంటున్న అధికార పార్టీ.ఇప్పుడు వెలుగు చూస్తున్న భూ అక్రమాలపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నిస్తోంది. ఈస్తుంటే విశాఖ రాజకీయం మళ్ళీ భూభ్రమణం చేస్తుం పరిణామాలు చూదనే అభిప్రాయం కలుగుతొంది.