వారిద్దరూ ఉత్తమ వికెట్ కీపర్లు : గంగూలీ

వారిద్దరూ ఉత్తమ వికెట్ కీపర్లు : గంగూలీ

రిషబ్ పంత్ మరియు వృద్ధిమాన్ సాహా ప్రస్తుతం దేశంలో అత్యుత్తమ వికెట్ కీపర్-బ్యాట్స్మాన్స్ అని భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి, ఎవరు ఆ బాధ్యతలు స్వీకరించాలి అనే చర్చ సాగుతూనే ఉంది. అయితే తాజాగా దాదా 'పంత్, సాహా ప్రస్తుతం ఉత్తమ వికెట్ కీపర్లు' అని తెలిపాడు. అయితే ఐపీఎల్ లో చివర్లో జట్టులోకి వచ్చిన సాహా మంచి ప్రదర్శన చేయగా పంత్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ విషయం పై దాదా మాట్లాడుతూ... పంత్ బ్యాట్ స్వింగ్ మళ్ళీ తిరిగి వస్తుంది. అయితే అతనికి కాస్త మద్దతు అవసరం అని పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత జట్టు ఆసీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మరి ఈ పర్యటనలో ఎవరు రాణిస్తారు అనేది చూడాలి.