ధోని, కోహ్లీ కెప్టెన్సీలో అదే పెద్ద తేడా...

ధోని, కోహ్లీ కెప్టెన్సీలో అదే పెద్ద తేడా...

ఆటగాళ్ల పై నమ్మకం ఉంచడం, జట్టు ఎంపిక పై పూర్తి అవగాహనా ఉండటమే ఐపీఎల్ లో మహేంద్రసింగ్ ధోని సక్సెస్ కు కారణమని భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ అన్నాడు. ఈ లక్షణం లో ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీకి లేకపోవడం కారణంగానే ఆ జట్టు విఫలమైందన్నాడు. మరో మూడు రోజులో ఐపీఎల్ 2020 ప్రారంభం కానున్న సమయంలో గంభీర్ ధోని, కోహ్లీల కెప్టెన్సీ తేడాల గురించి తెలిపాడు. కోహ్లీ చెప్తున్నట్లు తాను ఆర్సీబీ జట్టుతో సంతోషంగా ఉండి ఉంటె అతను ఇప్పటికే అత్యుత్తమ ఎలెవన్ పై ప్రణాళికలు చేసేవాడు. కానీ అతను అలా చేయలేదు. అందుకే తరచు జట్టులోని ఆటగాళ్లను మార్చేవాడు. జట్టుకు కేవలం బ్యాటింగ్ బలంగా ఉండే చాలు అని కోహ్లీ ఎప్పుడు భావిస్తాడు. కానీ ధోని జట్టు మాత్రం కనీసం లీగ్ లో సగం మ్యాచ్ల వరకు ఆటగాళ్ల పై నమ్మకం ఉంచి వారినే కొనసాగిస్తూ ఉంటుంది. కానీ ఆర్సీబీ మాత్రం వెంటవెంటనే ఆటగాళ్లను మారుస్తూ ముందుకు వెళ్తుంది. ఇదే ఈ ఇద్దరు కెప్టెన్ ల మధ్య ఉన్న ప్రధాన తేడా! చెన్నై జట్టు విజయానికి ఆర్సీబీ ఓటములకు కూడా ఇదే కారణం. కనీసం ఈ ఐపీఎల్ లోనైనా ఆర్సీబీ ఆటగాళ్లను మార్చకుండా నిలకడ కోసం ప్రయత్నించాలి అని గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇక ఆర్సీబీ మొదటి మ్యాచ్ ఈ నెల 21న సన్ రైజర్స్ తో ఆడనుంది.