టీఆర్ఎస్ ప్రచారంలో 'గబ్బర్ సింగ్' టీమ్

టీఆర్ఎస్ ప్రచారంలో 'గబ్బర్ సింగ్' టీమ్

టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో గబ్బర్ సింగ్ టీమ్ పాలుపంచుకుంది. మహబూబాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ తరుపున వారు ప్రచారం నిర్వహించారు. పదో వార్డులో ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటేయ్యాలని పిలుపునిచ్చారు. అనంతరం పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ సీతారాం నాయక్, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిష్‌ వెంకట్ మాట్లాడుతూ.. నాలుగేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వివరించామని తెలిపారు. శంకర్‌ నాయక్‌ మంచి వ్యక్తి కావడంవల్లే హైదరాబాద్‌ నుంచి వచ్చి ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. మరోవైపు పట్టణంలో గబ్బర్ సింగ్ టీమ్ సందడి చేయడంతో పలువురు అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు.