అలాంటి ఆటగాడు ఉంటె భారత్ ప్రతి మ్యాచ్ గెలుస్తుంది...

అలాంటి ఆటగాడు ఉంటె భారత్ ప్రతి మ్యాచ్ గెలుస్తుంది...

ప్రస్తుతం ఇంగ్లాండ్‌-వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అద్భుతమైన ప్రదర్శన కారణంగా ఆ జట్టు విజయం సాధించింది. ఇక ఈ గెలుపు పై టీమ్ ‌ఇండియా మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్ స్టోక్స్ ను ప్రశంసించాడు. "బెన్‌స్టోక్స్‌ వంటి ఆల్‌రౌండర్ ఆటగాడు‌ భారత జట్టులో ఉంటే భారత్  ప్రతి చోట ప్రతి మ్యాచ్ లో గెలిచేది అని ట్వీట్ చేశాడు. దీంతో ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే యువారాజ్ స్పందిస్తూ... "భారత జట్టులో మ్యాచ్‌లు గెలిపించే సత్తా ఉన్న ఆల్‌రౌండర్‌ లేడాని నీ అర్ధమా" అంటూ ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా " బ్రదర్.. యువరాజ్ క్రికెట్ కు వీడ్కోలు పలికారు" అంటూ పఠాన్ సమాధానం ఇచ్చాడు. దానికి యువరాజ్ ''ఇలాంటి సమాధానం నీ దగ్గర నుండి వస్తుంది అని నాకు తెలుసు.. నీవు కూడా తక్కువేమి కాదు"అని తెలిపాడు.