వ‌రుస‌గా 14వ రోజూ పెట్రో వ‌డ్డింపు..

వ‌రుస‌గా 14వ రోజూ పెట్రో వ‌డ్డింపు..

ఇంధ‌న ధ‌ర‌లు వ‌రుస‌గా పెరుగుతూనే ఉన్నాయి.. 14వ రోజు కూడా చ‌మురు ధ‌ర‌ల‌ను వ‌డ్డించారు.. పెట్రోల్ ధరలను లీటరుపై 51 పైస‌లు.. డీజిల్ ధరలను లీటరుపై 61 పైస‌లు పెంచేశారు.. దీంతో.. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధ‌ర‌ రూ .78.88కు చేర‌గా.. డీజిల్ ధర లీటరుకు రూ .77.67ను తాకింది. జూన్ 9 నుండి ఇంధన ధరల పెరుగుదల వ‌రుస‌గా ఇది 14 వ రోజు.. పెట్రోల్, డీజిల్ ధరలను గత రెండు వారాల్లో లీటరుకు రూ .7 కు పెంచారు. వీటికి స్థానిక ప‌న్నులు లేదా వ్యాట్ అద‌నం.. ముంబైలో పెట్రోల్ ధర లీట‌ర్‌కు రూ .85.72కు పెర‌గా.. డీజిల్ ధ‌ర రూ.75.54కు చేరింది. హైదరాబాద్‌లో 52 పైసలు పెరుగుదలతో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.81.88కు, 60 పైస‌లు పెర‌గ‌డంతో డీజిల్ ధర రూ.75.91కు చేరింది. ఇక‌, విజయవాడలో ట్రోల్ ధర 51 పైసలు పెరుగుదలతో రూ.81.87కు చేర‌గా.. డీజిల్ ధర 58 పైసలు పెరుగుదలతో రూ.75.94కు పెరిగింది.. ఇక‌, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెంచబడ్డాయి.. వీటికి స్థానిక అమ్మకపు పన్ను లేదా వ్యాట్‌ను బ‌ట్టి ఆయా రాష్ట్రాల్లో పెట్రో ధ‌ర‌లు పెర‌గున్నాయి..