వ‌రుస‌గా 18వ రోజూ పెంచారు.. పెట్రోల్ రేట్‌ను క్రాస్ చేసిన డీజిల్ ధ‌ర‌

వ‌రుస‌గా 18వ రోజూ పెంచారు.. పెట్రోల్ రేట్‌ను క్రాస్ చేసిన డీజిల్ ధ‌ర‌

వ‌రుస‌గా 18వ రోజు కూడా పెట్రో ధ‌ర‌ల వ‌డ్డ‌న త‌ప్ప‌లేదు.. అయితే.. గ‌త 17 రోజులకు భిన్నంగా ఇవాళ డీజిల్ ధ‌ర మాత్ర‌మే పెరిగింది.. ఇంధన ధరల సవరణ 18వ రోజు కూడా కొన‌సాగ‌గా.. డీజిల్‌పై 48 పైస‌లు వ‌డ్డించాయి చ‌మురు సంస్థ‌లు.. దీంతో.. ఇవాళ ఢిల్లీలో పెట్రోల్ ధ‌ర‌ను డీజిల్ ధ‌ర అధిగ‌మించింది..  జూన్ 7వ తేదీ త‌ర్వాత మొదటిసారిగా పెట్రోల్ ధర మార‌లేద‌ని చెప్పుకోవాలి. ఇక‌, డీజిల్ ధరలు గరిష్టానికి చేరి పైపైకి పాకుతోంది.. తాజా స‌వ‌ర‌ణ‌ల‌తో ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 79.76గా ఉండ‌గా.. లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ. 79.88కు పెరిగింది. 

ఇంధ‌న ధ‌ర‌ల‌ను వ‌రుస‌గా పెంచుతూ.. అందిన‌కాడికి పిండుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది ప్ర‌భుత్వం.. ఇది గృహ బ‌డ్జెట్‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతుంది.. ఇక‌, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల రవాణా మరియు వ్యవసాయ రంగాలపై ప్ర‌భావాన్ని స్ప‌ష్టంగా చూపిస్తోంది అని నిపుణులు చెబుతున్నారు.. డీజిల్ ధ‌ర‌ల భారం క్ర‌మంగా అన్ని వ‌స్తువుల‌పై చూపుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.. మ‌రోవైపు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ బారెల్ ధర 42 డాలర్లుగా ఉంది.