సీఎం గుడ్‌న్యూస్‌.. వాళ్ల‌కు ఉచిత రేష‌న్‌, వీరికి ఆర్థిక‌సాయం..

సీఎం గుడ్‌న్యూస్‌.. వాళ్ల‌కు ఉచిత రేష‌న్‌, వీరికి ఆర్థిక‌సాయం..

భార‌త్‌లో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.. దీంతో.. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ బాట‌ప‌ట్ట‌గా.. మ‌రికొన్ని రాష్ట్రాలు క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తున్నాయి.. అయితే, కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో.. లాక్‌డౌన్ విధించ‌డంలో ముందువ‌రుస‌లో నిలిచింది ఢిల్లీ ప్ర‌భుత్వం.. గ‌తంలో లేని విధంగా కొత్త కేసులు రికార్డు స్థాయిలో వెలుగు చూడ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు సీఎం అర‌వింద్ కేజ్రీవాల్.. ఇక‌, లాక్‌డౌన్ కార‌ణంగా ఇబ్బంది ప‌డుతోన్న పేద‌ల‌ను ఆదుకోవ‌డానికి ముందుకొచ్చిన కేజ్రీవాల్ స‌ర్కార్.. ఢిల్లీలోని ఆటోవాలాలు, ట్యాక్సీ వాలాల‌కు రూ.5000 చొప్పున ఆర్థిక సాయం అందించాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చింది.. అంతేకాదు.. రేష‌న్‌కార్డుదారుల‌కు కూడా ఉచిత రేష‌న్ ప్ర‌క‌టించారు కేజ్రీవాల్.. రేష‌న్ కార్డుదారుల‌కు రెండు నెల‌ల‌పాటు ఉచిత రేష‌న్ అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.. దీంతో.. ఢిల్లీలోని 72 ల‌క్ష‌ల మందికి పైగా ల‌బ్ధి చేకూర‌బోతోంది.. మ‌రోవైపు.. లాక్‌డౌన్‌పై కాస్త క్లారిటీ ఇచ్చారాయ‌న‌.. 2 నెల‌ల‌పాటు ఉచిత రేష‌న్ అందిస్తున్నంత మాత్రాన 2 నెల‌లపాటు లాక్‌డౌన్ కొన‌సాగుతుంద‌ని భావించ‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేశారు. కాగా, లాక్‌డౌన్‌ను ఇప్ప‌టికే ఢిల్లీ స‌ర్కార్ రెండుసార్లు పొడిగించిన సంగ‌తి తెలిసిందే.