వస్తే వారు కూడా రూల్స్ పాటించాల్సిందే...

వస్తే వారు కూడా రూల్స్ పాటించాల్సిందే...

కరోనా కాలంలో జరుగుతున్న ఐపీఎల్ 2020 నిర్వహణపై టోర్నీలోని 8 ఫ్రాంఛైజీలకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా కొన్ని సూచనలు చేసింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 జరగనుండగా అక్కడికి తీసుకెళ్లడం నుండి టోర్నీ ముగిసే వరకు ఆటగాళ్లని సురక్షితంగా చూసుకోవడం ఫ్రాంఛైజీల బాధ్యత అని తెలుపుతూ మొత్తం 16 పేజీల డాక్యుమెంట్‌ని పంపింది. ఇక మొత్తం 53 రోజులు జరగనున్న ఐపీఎల్ కు ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అనుమతించాలా.. వద్ద అనే విషయాన్ని బీసీసీఐ ఫ్రాంఛైజీలకే వదిలేసింది. ఒకవేళ అనుమతిస్తే వారు కూడా లీగ్ ముగిసేంతవరకు బయో సెక్యూర్ బబుల్‌లో ఉండాల్సిందే అని చెప్పింది. ఈ బబుల్ లోకి ఒకసారి ఎవరైనా అడుగుపెడితే ఐపీఎల్ పూర్తయేంతవరకు బయటి  వ్యక్తులని కలవకూడదు. యూఏఈ కి చేరుకున్న తర్వాత ఆటగాళ్లను 14 రోజుల క్వారంటైన్‌లో ఉంచి  రెండు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. అందులో నెగెటివ్ వచ్చిన ఆటగాళ్లు మాత్రమే ఐపీఎల్ లో ఆడుతారు. ఇక ఇందులో ఆడుతున్న 8 జట్లను యూఏఈలో వేరువేరు హోటల్‌లో ఉంచాలని ఫ్రాంఛైజీలకి బీసీసీఐ సూచించింది. టోర్నీ జరిగే సమయంలో కూడా ప్రతి ఐదు రోజులకి ఒకసారి క్రికెటర్లకి కరోనా పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత కూడా ఆ జట్టు ఫ్రాంఛైజీలకే అప్పగించింది బీసీసీఐ.