వరుసగా నాలుగు వికెట్లు తీసి రికార్డు నెలకొల్పిన మహిళా క్రికెటర్...

వరుసగా నాలుగు వికెట్లు తీసి రికార్డు నెలకొల్పిన మహిళా క్రికెటర్...

వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి రికార్డు నెలకొల్పింది ఓ మహిళా క్రికెటర్. భారత సంతతికి చెందిన అనురాధ దొడ్డబళ్లాపూర్ అనే క్రికెటర్ జర్మనీ మహిళా క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవరిస్తుంది.‌ వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు పురుషుల క్రికెట్ లో శ్రీలంక పేసర్ లసిత్ మలింగా వన్డే లో తీసాడు. కానీ టీ 20 వంటి పొట్టి ఫార్మాట్‌లో ఓ బౌలర్‌ 4 వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి. కరోనా విరామం తర్వాత ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో జర్మనీ జట్టు 20 ఓవర్లలో 198 పరుగులు చేసింది. ఆ తర్వాత బౌలింగ్ లో అనురాధ 15వ ఓవర్లో 2 వ బంతికి ఓ బాట్స్మెన్ ను క్యాచ్ రూపంలో పెవిలియన్ కు చేర్చగా మిగిత ముగ్గురిని బౌల్డ్  చేసింది. ఇక ఆ తర్వాత మరో ఓవర్లో ఇంకో వికెట్ తీసి 5 వికెట్స్ హల్ లో చేరిపోయింది. ఈ దెబ్బకు ఆస్ట్రియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 61 పరుగులే చేయగలిగింది. దాంతో జర్మనీ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.