క‌ర్నూలులో దారుణం.. భ‌ర్త‌ను బంధించి.. భార్య‌ను లాక్కెళ్లి..!

క‌ర్నూలులో దారుణం.. భ‌ర్త‌ను బంధించి.. భార్య‌ను లాక్కెళ్లి..!

క‌ర్నూలు జిల్లాలో దారుణ‌మైన ఘ‌ట‌న వెలుగుచూసింది..  భ‌ర్త‌ను బంధించి భార్య‌ను లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.. వివ‌రాల్లోకి వెళ్తే.. కర్నూలు వెలుగోడు జమ్మినగర్ తండాలో.. ఓ వివాహిత‌పై క‌న్నేసిన న‌లుగురు కామాంధులు.. భర్తను బంధించి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు.. అడ్డుకునేందుకు య‌త్నించిన భ‌ర్త‌ను చిత‌క‌బాది బంధించిన నీచులు.. భ‌ర్త ఎదుటే.. భార్యపై సామూహిక అత్యాచారానికి తెగ‌బ‌డ్డారు. ఈ విషయమై స్థానిక గిరిజ‌నులు, ప్ర‌జాసంఘాల నేత‌లు సోమవారం ఆందోళ‌న‌కు దిగారు.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమని మండిప‌డుతూ.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.. దీంతో స్పందించిన డీఎస్పీ.. నిందితుల‌ను పట్టుకుని కఠినచర్యలు తీసుకుంటామని, బాధితురాలికి అన్నివిధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగు రోజుల క్రితమే ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌గా.. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.. కాగా, వ‌రుస‌గా మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.. ఒంట‌రి మ‌హిళ‌ల‌ను క‌నిపిస్తే చాలు రెచ్చిపోతున్న కామాంధులు.. ఇప్పుడు.. భ‌ర్త‌ను బంధించి మ‌రీ వివాహిత‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.