మాజీ కేంద్ర‌మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష

మాజీ కేంద్ర‌మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష

1999లో జార్ఖండ్ కోల్ స్కామ్‌‌ కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడినట్లు మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రేపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. విచారణ సందర్భంగా దోషులతోపాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాదనలను విన్న కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. అక్టోబర్ 6న వీరిని దోషులుగా తేల్చిన కోర్టు తాజాగా వీరి శిక్షలు ఖరారు చేసింది. దిలీప్ రేతో పాటు మరో ఇద్దరు అధికారులకు కూడా కోర్టు జైలు శిక్ష విధించింది. దిలీప్ రే అప్పటి అటల్ బిహారి వాజ్ పేయి మంత్రివర్గంలో కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు. బొగ్గు కుంభకోణంలో ఓ కేంద్ర మాజీ మంత్రికి శిక్ష పడటం ఇదే తొలిసారి.