మాజీ మంత్రి కొప్పన మోహనరావు ఇకలేరు.!

మాజీ మంత్రి కొప్పన మోహనరావు ఇకలేరు.!

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కొప్పన మోహనరావు(75) ఇకలేరు. బుధవారం కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. కోట్ల విజయభాస్కరరెడ్డి హయంలో కొప్పన అటవీ శాఖ మంత్రిగా పని చేశారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన పిఠాపురం లో వైసీపీ కి సేవలందించారు. కొప్పన మోహనరావు మృతిపట్ల ఎమ్మెల్యే పెండెం దొరబాబు, వైఎస్ఆర్సీపీ నేతలు సంతాపం తెలిపారు.