మాజీ క్రికెటర్ మృతి.. బీసీసీఐ సంతాపం

మాజీ క్రికెటర్ మృతి.. బీసీసీఐ సంతాపం

భారత మాజీ క్రికెటర్ సదాశివ్ రావూజీ పాటిల్ మృతి చెందారు. కొల్లాపూర్‌లోని తన నివాసంలో మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు. ఆయన భారత జట్టుకు ఒక టెస్టు మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించారు. పాటిల్‌ మృతిపై బీసీసీఐ సంతాపం తెలిపింది. ట్విటర్‌ వేదికగా క్రికెట్‌లో ఆయన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంది. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా పాటిల్‌ మంచి గుర్తింపు సాధించారు. 1952లో మహారాష్ట్ర తరఫున తన తొలి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడారు. తొలి మ్యాచ్‌లోనే 3 వికెట్లు తీసి సత్తాచాటారు. అలా.. భారత జట్టుకు ఎంపికయ్యారు. 1955లో న్యూజిలాండ్‌తో బ్రబౌన్‌ మైదానంలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ ఆడారు. ఇన్నింగ్స్‌కో వికెట్‌ చొప్పున రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత ఆయన మహారాష్ట్ర జట్టుకు ఎక్కువగా ప్రాతినిధ్యం వహించారు.