నిద్రలోనే మరణించిన భారత మాజీ క్రికెటర్...

నిద్రలోనే మరణించిన భారత మాజీ క్రికెటర్...

భారత మాజీ క్రికెటర్ సదాశివ్‌ రావ్‌జీ పాటిల్(86) కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నిన్న ఆయన తన నివాసంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్లు కొల్హాపూర్‌ జిల్లా క్రికెట్‌ సంఘం మాజీ అధికారి రమేశ్‌ కదమ్‌ తెలిపారు. పాటిల్ మరణానికి బీసీసీఐ సంతాపం తెలిపింది. అయితే మీడియం పేసర్‌ అయిన పాటిల్‌... 1955లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆయన భారత ‌జట్టులోకి అరంగేట్రం చేసారు. కానీ ఒకే టెస్టు మ్యాచ్‌కు పరిమితం అయ్యారు. ఇక భారత్‌ తరపున టెస్టు మ్యాచ్‌ ఆడిన 79వ ఆటగాడిగా పాటిల్ నిలిచారు. అయితే ఈ మ్యాచ్ లో భారత్ 27 పరుగులతో విజయం సాధించడంలో పాటిల్ కీలక పాత్ర పోషించారు అని బీసీసీఐ తెలిపింది. ఈ మ్యాచ్ తర్వాత లాంక్‌షైర్‌ లీగ్‌లో 1959-1961 మధ్య రెండు సీజన్‌ల్లో 52 మ్యాచ్‌ లు ఆడి 111 వికెట్లు తీశారు. అలాగే 1952–64 మధ్య మహారాష్ట్ర తరపున 36 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడారు. అందులో 866 పరుగులు చేసిన ఆయన 83 వికెట్లు తీసి ఆల్ రౌండర్ ప్రదర్శన చేసారు.