కరోనాతో మాజీ ఆరోగ్యశాఖ మంత్రి మృతి.!

కరోనాతో మాజీ ఆరోగ్యశాఖ మంత్రి మృతి.!

గోవా మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సురేష్ అమోంక‌ర్ (68) సోమవారం కరోనా తో మరణించారు. కొద్ది రోజుల క్రితం ఆయన కరోనా భారిన పడటం తో చికిత్స నిమిత్తం మార్మోవాలోని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. సురేష్ అమోంకర్ మరణించిన విషయాన్ని గోవా ప్రస్తుత ఆరోగ్యశాఖ మంత్రి  విశ్వ‌జిత్ రాణె ధ్రువీకరించారు. 1999లో మొదటిసారి ఎమ్మెల్యే గా గెలిచిన అమోంకర్ వైద్య,సాంఘిక సంక్షేమశాఖ, కార్మిక ఉపాధి శాఖల  మంత్రిగా పనిచేసారు. ఆయన మృతి పట్ల ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్ సహా పలువురు సంతాపం తెలిపారు. మరోవైపు గోవాలో ఇప్పటివరకు మొత్తం 1,761 కరోనా కేసులు నమోదయ్యాయి. వారిలో 936 మంది కోలుకుని ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా భారిన పడి ఇప్పటివరకు 7గురు మృతి చెందారు.