భారత జట్టు పై మాజీల ప్రశంసలు...

భారత జట్టు పై మాజీల ప్రశంసలు...

ఐపీఎల్ ముగిసిన తర్వాత నేరుగా ఆసీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు అక్కడ చరిత్రను సృష్టించింది. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ నాలుగో టెస్ట్ లో విజయం సాధించి సిరీస్ ను సొంతం చేసుకోవడం పై ‌ పలువురు ప్రముఖులు, మాజీలు సోషల్‌ మీడియా ద్వారా జట్టు పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్‌ దిగ్గజం మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ స్పందిస్తూ... గొప్ప సిరీస్ విజయాలలో ఇదొకటి అని ట్వీట్‌ చేశారు. ప్రతి సెషన్‌కి క్రొత్త హీరో వస్తున్నాడు. ప్రతీసారి విజయం సాధించాం. సిరీస్ మొత్తం గాయాల్ని ఎదుర్కొన్నామని సచిన్‌ ట్వీట్‌ చేశారు. ఇక భారత విజయం పై  బీసీసీఐతో విరాట్‌ కోహ్లి, వీవీఎస్‌ లక్క్ష్మణ్‌, శిఖర్‌ ధావన్‌ , ఇశాంత్‌ శర్మ తదితరులు ట్విటర్‌ ద్వారా తమ ఆనందాన్ని ప్రకటించారు. అంతేకాదు టెక్‌ దిగ్గజం సుందర్‌ పిచాయ్‌  కూడా టీమిండియా గెలుపుపై సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. గొప్ప టెస్ట్ సిరీస్‌లో ఒకటి అని విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు తెలిపారు. బీసీసీఐ ప్రశంసలతో పాటుగా జట్టుకు 5 కోట్ల బోనస్ కూడా ప్రకటించింది.