ధోని యువకులు వస్తున్నారు... ఆలోచించు..

ధోని యువకులు వస్తున్నారు... ఆలోచించు..

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గత సంవత్సర కాలంగా క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. బీసీసీఐ తన సెంట్రల్ కాంట్రాక్ట్ లో కూడా ధోనికి చోటు కల్పించలేదు. అందువల్ల అతని కెరియర్ పై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా ధోని కెరియర్ పై మాజీ సెలక్టర్ రోజర్ బిన్నీ స్పందించారు. ఆయన మాట్లాడుతూ... ధోని ఎటువంటి ఆటగాడో అందరికి తెలుసు. కానీ గత కొంతకాలంగా ధోని ఫిట్నెస్ కొంచెం తగ్గింది. అయితే ఇప్పుడు భారత జట్టులోకి యువకులు చాలా మంది వస్తున్నారు. వారికి అవకాశాలు ఇవ్వాలి. అయితే రిటైర్మెంట్ గురించి మాత్రం ధోని స్వయంగా ఆలోచించుకోవాలి. తాను ఇంకా ఆట ఆడగలన... లేదా అనేది ధోనీనే తేల్చుకోవాలి. ఇక ధోని కెప్టెన్ గా ఉన్న కాలం లో సెలక్టర్లలో ఒకడిగా రోజర్ బిన్నీ ఉన్నాడు. ఒక కెప్టెన్ గా తనకు ఏం కావాలో అడుగుతాడు, కానీ ఆ విషయాల్లో చాలా సున్నితంగా ప్రవర్తిస్తాడు అని బిన్నీతెలిపాడు. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ జరుగుతుండటంతో గత ప్రపంచ కప్ తర్వాత మళ్ళీ ధోనిని గ్రౌండ్ లో చూడవచ్చు.