గోదావ‌రిలో వ‌ర‌ద ఉధృతి.. కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు

గోదావ‌రిలో వ‌ర‌ద ఉధృతి.. కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో గోదావ‌రి న‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది... భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతుండ‌డంతో... ధవళేశ్వరం బ్యారేజీ నుండి 6.45 ల‌క్ష‌ల క్యూసెక్కుల మిగులు జ‌లాల‌ను సముద్రంలోకి విడుద‌ల చేస్తున్నారు అధికారులు.. ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజీ ద‌గ్గ‌ర ప్ర‌స్తుతం నీటిమ‌ట్టం 8.5 అడుగులకు చేరింది. ఇక‌, గోదావరిలో వరద పెరుగుతోన్న నేప‌థ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌ల‌ను ఏర్పాటు చేశారు. 

తూర్పుగోదావ‌రి జిల్లాలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌ల వివ‌రాలు:
* కాకినాడ కలెక్టరేట్ - 180042503077
* రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం - 0883-2442344
* ఎటపాక సబ్ కలెక్టర్ కార్యాలయం - 08748-285279
* రంపచోడవరం ఐటిడిఏ పిఓ కార్యాలయం - 18004252123
* కాకినాడ ఆర్డీఓ కార్యాలయం -  0884-2368100
* అమలాపురం ఆర్డీఓ కార్యాలయం - 08856-233100
* రామంద్రపురం ఆర్డీఓ కార్యాలయం - 08857-245166