మళ్లీ ఆఫర్ల మోత.. ఏకంగా 80 శాతం డిస్కౌంట్లు.. !

మళ్లీ ఆఫర్ల మోత.. ఏకంగా 80 శాతం డిస్కౌంట్లు.. !

ఫెస్టివల్ సీజన్‌ వచ్చిందంటే చాలు.. ఆఫర్ల వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి ఈ కామర్స్ సంస్థలు.. ఇప్పటికే ఈకామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ ప్రత్యేక ఆఫర్లు తీసుకువచ్చాయి.. ఫ్లిప్‌కార్ట్ అక్టోబర్ 17 నుంచి 21వ తేదీ వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహించింది.. ప్రస్తుతం దసరా స్పెషల్ సేల్ నడుస్తుండగా.. అది ఈ నెల 28వ తేదీతో ముగిసిపోనుంది.. ఇదే సమయంలో.. మరోసారి భారీ ఆఫర్లు ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్... ఈ నెల 29వ తేదీ నుంచి బిగ్ దివాలి సేల్స్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది... ఈసారి స్మార్టఫోన్లు, లాప్‌టాప్‌లపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్‌.. మరోవైపు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉంటాయని వెల్లడించింది.

ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు వినియోగించి మీకు కావాల్సిన వస్తువలను కొనుగోలు చేస్తే.. క్యాష్ బ్యాక్ ఆఫర్లు వర్తింపజేయనున్నారు.. ఇక, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐల ద్వారా నోకాస్ట్ ఈఎంఐలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.. ఇక, వీటికి అదనంగా రాత్రి 12 గంటలకు, ఉదయం 4 నుంచి 8 గంటల వరకు ప్రత్యేకమైన డీల్స్ కూడా ఉండనున్నాయి. ఈ సేల్‌ 29వ తేదీ నుంచి నవంబర్‌ 4వ తేదీ వరకు కొనసాగనుంది. మొత్తానికి ఫెస్టివల్ సీజన్‌లో కస్టమర్లను ఆకట్టుకుని సేల్స్ పెంచేందుకు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి ఈకామర్స్ సంస్థలు.