గ్రేటర్ వరంగల్ లో సీఎం కేసీఆర్ బర్త్ డే ఫ్లెక్సీ వివాదం

గ్రేటర్ వరంగల్ లో సీఎం కేసీఆర్ బర్త్ డే ఫ్లెక్సీ వివాదం

ప్లెక్సీలు పెట్టొద్దంటారు..పెట్టిన వాళ్లని తీసేయమంటారు. మాటవినకపోతే సిబ్బంది రంగంలోకి దిగి స్వయంగా తొలగిస్తారు. ఇదీ జరగాల్సిన విషయం. కానీ, ఇక్కడ అందరికీ సమన్యాయం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్ద నాయకులు పెట్టిన ఫ్లెక్సీలు ఉంచి ఛోటామోటా నేతలవి తీసేస్తున్నారట. దీనిపై అధికార పార్టీ నేతలే ఫిర్యాదులు చేస్తున్నారట..

ఫెక్సీల తొలగింపులో గ్రేటర్ వరంగల్ అధికారుల తీరు వివాదస్పదంగా మారుతోంది. కొందరివి తొలగించి మరి కొందరివి వదిలేయడంపై అధికార పార్టీ నేతల్లోనే అసంతృఫ్తి ఉంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఇప్పటికే ఆందోళన చేస్తే, అధికార పార్టీ నేతలు సైతం వారిపై పిర్యాదుకు సిద్దపడుతున్నారట

గ్రేటర్ వరంగల్ అధికారులపై ఇప్పటికే చాలా ఆరోపణలున్నాయి. ఆక్రమార్జనకు అలవాటు పడ్డ కొందరు అధికారుల తీరుతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అవుట్ సోర్స్ ఉద్యోగుల నియమాకాల్లో ఆక్రమాలు చోటు చేసుకుంటున్నాయని వస్తున్న అరోపణలు మరువక ముందే,  ఫ్లెక్సీల తొలగింపులో కొందరు అధికారుల వివక్ష చర్చగా మారింది. కాసులు ఇస్తే వదిలేయడం లేకపోతే తొలగించడం చేస్తున్నారనే విమర్శలున్నాయి. 

సీఎం కేసిఆర్ పుట్టిన రోజు సందర్బంగా నరగంలో చాలా చోట్ల ఫెక్సీలు వెలిశాయి. ముఖ్యమంత్రి కేసిఆర్ ను ప్రసన్నం చేసుకోవడం కోసం చాలా మంది ప్రజా ప్రతినిధులు అయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేశారు. కొందరు నేతలైతే మూడు రోజులపాటు వేడుకలు నిర్వహించారు. ఇందులో బాగంగా పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిదులు ముఖ్యమంత్రి కేసిఆర్  కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ  ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో నగరంలోఎక్కడ చూసినా ఫ్లెక్సీలే దర్శనం ఇచ్చాయి. 

కేసిఆర్ ఫోటోలతో పాటు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల పై కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో నగర పాలక సంస్థ రాత్రికి రాత్రి వాటిని తొలగించాలంటూ ఆదేశించింది. ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళు తొలగించకపోవడంతో కార్పోరేషన్ సిబ్బంది రంగంలోకి దిగారు. కానీ, ఫ్లెక్సీల తోలగింపులో మాత్రం కార్పొరేషన్ లోని కొందరు సిబ్బంది వివక్షచూపారనే టాక్‌ మొదలైంది. ఎమ్మెల్యే ఎంపీ స్థాయి ప్రజా ప్రతినిధులు ఏర్పాటు చేసిన  ఫ్లెక్సీలను తొలగించకుండా, ఛోటా మోటా నేతలు పెట్టిన ఫ్లెక్సీలను మాత్రమే తొలగించారనే ఆరోపణలున్నాయి. త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికలకు ఉపయోగపడేలా ఆశావహులు  ఏర్పాటు చేసిన వాటిని తొలగించి .. ఎమ్మేల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులవి  మాత్రం ఉంచేశారు. దీంతో తమ ఫ్లెక్సీలు తొలగించి, ఇతరులవి ఉంచటంలో కార్పొరేషన్‌ తీరుపై అధికార పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారట.

గతంలో కూడా ఈ ఫ్లెక్సీల వివాదం తెరపైకి వచ్చింది. అప్పుడు అధికార పార్టీ నేతలవి ఉంచి ఇతర పార్టీ నేతలవి తొలగించారనే వివాదం రేగింది. వివేకానందుడి జన్మదినం సందర్బంగా బిజేపి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించడంతో ఏకంగా బిజేపి కార్పోరేషన్ అఫీసు ముందు  ఆందోళలను కూడా చేసింది. 

మరో వైపు హైదరాబాద్ లో ఏకంగా మేయర్ కే ఫైన్ వేసిన ఉదాహరణలున్నాయి. కానీ, వరంగల్‌ లో మాత్రం,   ప్లెక్సీల తొలగింపులో కూడా గందరగోళం ఉందనే టాక్‌ ఉంది.   అదికారులు మాత్రం ఎన్నికల కోడ్‌ మేరకు ఫ్లెక్సీలను తొలగించాం అని చెప్తున్నారట.

ఉన్నాతాధికారుల ఆదేశాలను క్రింది స్థాయి సిబ్బంది అర్థం చేసుకోలేకపోవటంతోనే ఈ విమర్శలు వస్తున్నాయని మరికొందరి వాదన. దీనికి తోడు కొందరు ప్రజాప్రతినిధులకు ఏజెంట్లుగా వ్యవహారిస్తున్న సిబ్బంది కారణంగా కార్పోరేషన్ ఉద్యోగులంతా అభాసు పాలవుతున్నారనే వాదనా ఉంది. ఇప్పటికైనా వరంగల్‌ కార్పోరేష్‌ పై ఉన్న ఆరోపణలు సమసిపోయేలా చర్యలు తీసుకుంటారో లేదో అనే చర్చ నడుస్తోంది.