గుడ్ న్యూస్: ఈ డివైజ్ తోకరోనా రోగులను ఈజీగా గుర్తించవచ్చు...!!

గుడ్ న్యూస్: ఈ డివైజ్ తోకరోనా రోగులను ఈజీగా గుర్తించవచ్చు...!!

కరోనా లక్షణాలుంటేనే కరోనా రోగులను గుర్తుపట్టేందుకు వీలు ఉంటుంది.  ఆ లక్షణాలు లేకుండా కరోనా రోగులను గుర్తుపట్టడం అంటే కష్టం.  అయితే, చాలామందిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా వైరస్ ఎటాక్ అవుతున్నది.  దీని వలన అనేక ఇబ్బందులు వస్తున్నాయి.  లక్షణాలు ఉంటె వారిని సపరేట్ చెయ్యొచ్చు.  కానీ, కరోనా లక్షణాలు లేకుండానే టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.  దీనికోసం షికాగో లోని నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం ఓ డివైజ్ ను తయారు చేసింది.  చిన్న తపాలా బిళ్ళ అంతసైజులో ఉండే దీనిని గొంతు భాగంలో అమర్చుతారు.  

ఇలా అమర్చిన ఈ డివైజ్ ను హాస్పిటల్ లోని సెన్సార్లకు అనుసంధానం చేస్తారు.  రోగి శరీరంలో వేడిని, దగ్గులో వచ్చే మార్పులను, హృదయ స్పందన తీరును ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంది.  అనలైజ్ చేసి హాస్పిటల్ లోని సెన్సార్లకు సమాచారం అందిస్తుంది.  ఫలితంగా రోగి కరోనాతో బాధపడుతున్నాడా లేదా అన్నది గుర్తించడం ఈజీ అవుతుందని పరిశోధకులు చెప్తున్నారు.