మొదటిసారి ఆ చెత్త రికార్డు సొంతం చేసుకున్న సిఎస్కే...

మొదటిసారి ఆ చెత్త రికార్డు సొంతం చేసుకున్న సిఎస్కే...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఇప్పటివరకు 12 సీజన్లు పూర్తిచేసుకుంది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ 10 సీజన్లు మాత్రమే ఆడింది. మధ్యలో నిషేధం కారణంగా రెండేళ్లు దూరంగా ఉంది. అయితే ఆడిన10 సీజన్లలో మూడు సార్లు టైటిల్, 5 సార్లు రన్నరప్, ఒక సెమీస్... ఇది ఐపీఎల్ లో సిఎస్కే ప్రయాణం. కానీ ఇప్పటివరకు ఐపీఎల్ లో ఏ స్థాయి లోనైనా చెన్నై సూపర్ కింగ్స్ చివరి స్థానానికి రాలేదు. కానీ ఈ ఏడాది దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 13వ సీజన్ లో ఆ చెత్త రికార్డు కూడా సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2020 లో ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడిన సిఎస్కే ఒకటి గెలిచి రెండు ఓడిపోయి -0.840 నెట్ రన్ రేట్ తో చివరి స్థానంలో నిలిచింది. సిఎస్కే పరాజయాలకు సంభందించి సీనియర్ ఆటగాళ్లు అందరూ ధోనీనే విమర్శిస్తున్నారు. బ్యాటింగ్ లైన్ అప్ లో అతను తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగానే ఆ జట్టు ఓడిపోతుంది అని తెలిపారు. 217 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ధోని 7వ స్థానంలో బ్యాటింగ్ కు రావడం పై పెద్ద చర్చే జరిగింది. ఇక ఇదిలా ఉంటె ఐపీఎల్ లో స్ట్రాంగ్ టీమ్స్ గా పేరొందిన ముంబై, సన్ రైజర్స్, కోల్ కతా, చెన్నై ఈ నాలుగు జట్లు చివరి నాలుగు స్థానాల్లో ఉండగా ఐపీఎల్ ప్రారంభ సీజన్ లో కప్ గెలిచి ఆ తర్వాత వెనుకబడి పోయిన రాజస్థాన్ ఆ తర్వాత ఒక్కసారి కూడా టైటిల్ అందుకొని ఢిల్లీ, బెంగుళూర్, పంజాబ్ వరుసగా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. చూడాలి మరి లీగ్ దశ ముగిసే లోపు ఏ జట్టు ఏ స్థానంలో ఉంటుంది అనేది.