తెలంగాణ లో తొలి కరొనా మరణం - దేశంలో ఈ ఒక్కరోజే 194 కరోనా కేసులు..
తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నిన్నటి వరకు 59 కరోనా కేసులు ఉండగా ఈరోజు ఈ కేసులు మరో ఆరు పెరిగాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసులు 65కు చేరుకుంది. కరొనా కేసులు పెరిగిపోతుండటంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది ప్రభుత్వం. ఎక్కడి వ్యక్తులు అక్కడే ఉండాలని, బయటకు రావొద్దని ప్రభుత్వం సూచిస్తోంది. ఇక తెలంగాణలో తొలి కరోనా మరణం సంభవించింది. ఖైరతాబాద్ కు చెందిన 74 ఏళ్ల వృద్దుడు మరణించాడు. గ్లోబల్ హాస్పిటల్ లో అనారోగ్య కారణంగా చికిత్స పొందుతూ మరణించాడు. అయితే, మరణించిన తరువాత టెస్ట్ చేయగా మరణించిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.
ఇక ఇదిలా ఉంటే, ఇండియాలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజు 150 వరకు కొత్త కేసులు నమోదు కాగా, ఈరోజు 194 కొత్త కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం భారతదేశం కరోనా వ్యాప్తిలో రెండో దశలో ఉన్నది. దీన్ని మూడో దశకు వ్యాపించకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు అన్నీరకాల చర్యలు తీసుకుంటున్నాయి. అందుకోసమే దేశంలో లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ ను ఉల్లంఘించిన 76 వేల మందిపై పోలీసులు కేసులు పెట్టారు. వాహనాలను సీజ్ చేస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)