ఢిల్లీలో తొలి కేసు నమోదు... అప్ర‌మ‌త్త‌మైన అధికారులు...

ఢిల్లీలో తొలి కేసు నమోదు... అప్ర‌మ‌త్త‌మైన అధికారులు...

దేశాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి అత‌లాకుత‌లం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టికే ల‌క్ష‌లాదిమంది ఇబ్బందులు ప‌డుతున్నారు.  అయితే, క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటం చేసేందుకు దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రావ‌డంతో క‌రోనా అంతం అవుతుంద‌ని అధికారులు, ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారు.  ఒక‌వైపు క‌రోనా ఇబ్బందులు పెడుతుంటే, మ‌రోవైపు బ‌ర్డ్ ఫ్లూ దేశాన్ని భ‌య‌పెడుతోంది.  అనేక రాష్ట్రాల్లో బ‌ర్డ్ ఫ్లూ వ‌ల‌న వేలాది ప‌క్షులు, కోళ్లు మృత్యువాత ప‌డుతున్నాయి.  ఇక ఇదిలా ఉంటే, డిల్లీలో తొలి బ‌ర్డ్ ఫ్లూ కేసులు అధికారికంగా నిర్ధారించారు.  నేష‌న‌ల్ జులాజిక‌ల్ పార్క్ లోని గుడ్ల‌గూబ‌కు బ‌ర్డ్ ఫ్లూ సోకి చ‌నిపోయింద‌ని  జూ అధికారులు నిర్ధారించారు.  వెంట‌నే జూ ను శానిటేష‌న్ చేయడంతో పాటుగా, అక్క‌డి మాంసాహారం తీసుకునే జంతువుల‌కు కోడి మాంసం ఇవ్వ‌డం నిలిపివేశారు.