ఆ పావురంపై ఎఫ్ఐఆర్... ఇదే కారణం 

ఆ పావురంపై ఎఫ్ఐఆర్... ఇదే కారణం 

అనుమానాస్పదంగా ఎగురుతున్న ఓ పావురంపై పోలీసులు కేసులు నమోదు చేశారు.  ఇండియా పాక్ సరిహద్దుల్లోని రోరన్ వాలాకు గస్తీస్థావరంలో  ఓ పావురం ఎగురుతూ కనిపించింది.  ఆ పావురం గస్తీ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నీరజ్ కుమార్ భుజంపై ఆ పావురం వాలింది.  అయితే, దాని కళ్ళకు ఓ తెల్లని కాగితం ఉండటంతో అనుమానంతో ఆ పావురాన్ని తీసుకెళ్లి  గస్తీ స్థావరం కమాండర్ కు అప్పగించారు.  తెల్ల కాగితంలో ఓ నెంబర్ రాసి ఉండటంతో పాక్ నుంచి ఆ పావురం వచ్చి ఉంటుందని అనుమానించి దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.  ఇటీవలే జమ్మూ కాశ్మీర్ లో కూడా ఇలాంటి ఘటన జరిగింది.  పాక్ లో ట్రైనింగ్ ఇచ్చిన పావురాలు ఇలా ఇండియాలోకి వస్తున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.