బడ్జెట్‌పై కసరత్తు..
బడ్జెట్ రూపకల్పనపై ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి... సచివాలయంలో వివిధశాఖల మంత్రులతో ఆయన విడివిగా సమావేశం కానున్నారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదలనపై చర్చించనున్నారు. ఇవాల ఒకే రోజు 12 శాఖలపై చర్చలు జరపనున్నారు ఆర్థిక మంత్రి బుగ్గన.. ఈ చర్చలకు వివిధ శాఖలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. మంత్రులు ధర్మాన, పేర్నినాని, కన్నబాబు, మోపిదేవి, అవంతి, కొడాలి నాని, తానేటి వనిత, ఆళ్లనాని, జయరాం, విశ్వరూప్, పుష్పశ్రీవాణి, శ్రీరంగనాథరాజు ఆర్థికమంత్రి బుగ్జనతో చర్చలు జరపనున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)