జలీల్‌ఖాన్ కుమార్తెపై ఫత్వా..

జలీల్‌ఖాన్ కుమార్తెపై ఫత్వా..

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ కుమార్తె షబానా ఖాతూన్ పై ఫత్వా జారీ చేశారు ముస్లిం మత పెద్దలు. ఇస్లాం మతం ప్రకారం బుర్ఖా లేకుండా మహిళలు రాజకీయాల్లోకి రాకూడదని పేర్కొంటూ.. ఈ మేరకు ఫత్వా జారీ చేశారు మౌలానా అబ్దుల్ ఖదీర్ రిజ్వి. అయితే, 2009లో మాజీ మేయర్ మల్లికా బేగం.. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ దక్కించుకున్నారు. టికెట్‌ కోసం ప్రయత్నించి భంగపడిన జలీల్ ఖాన్.. దీంతో మతపెద్దలపై ఒత్తిడి చేసి మల్లికా బేగంపై ఫత్వా జారీ చేయించారనే చర్చ సాగింది. ఇక ఫత్వా కారణంగా 2009లో మల్లికాబేగం ఓటమిపాలైంది. మరోవైపు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జలీల్ ఖాన్ కుమార్తె షబానా పోటీచేసేందుకు సిద్ధమవుతుండడంతో.. తన లాగే షబానా పై కూడా ఎందుకు ఫత్వా జారీ చేయలేదని మత పెద్దలను నిలదీశారు మల్లికాబేగం.. ముస్లిం మహిళని అని కూడా చూడకుండా తనపై జలీల్‌ ఖాన్ విషం కక్కాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు ముస్లింలు తనకు ఓటు వేయనివ్వకుండా జలీల్ ఖాన్ మతంను అడ్డుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తన కుమార్తెను ఎలా రాజకీయాలలోకి తెచ్చారని ప్రశ్నించారు మల్లికాబేగం. దీంతో గతంలో మల్లికా బేగంపై ఫత్వా జారీ చేసినట్టుగానే ఇప్పుడు షబానాపై ఫత్వా జారీ అయ్యింది. గతంలో జలీల్ ఖాన్ చేసిన తప్పే ఇప్పుడు ఆయనను వెంటాడుతోందనే చర్చ సాగుతోంది. మల్లికా బేగం మీద జారీ చేసిన ఫత్వానే జలీల్ కుమార్తె మీద అమలు అవుతుందని.. మహిళలు అందరికి ఇది వర్తిస్తోందని ముస్లిం మత పెద్ద స్పష్టం చేశారు.