ఏపీలో దారుణం.. కన్నకూతురినే గర్భవతిని చేసిన తండ్రి

 ఏపీలో దారుణం.. కన్నకూతురినే గర్భవతిని చేసిన తండ్రి

ఎన్ని చ‌ట్టాలు వ‌చ్చినా కామాంధుల్లో భ‌యం లేకుండా పోయింది.. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్తే.. ఎవ్వ‌డు కాటేస్తాడో తెలియ‌దు.. ఎప్పుడు ఎక్క‌డ ఏం జ‌రుగుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి.. కానీ, ఇంట్లోనే.. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే పాడుప‌ని చేశాడు.. వావీవరసలు మరచి కామవాంఛతో రెచ్చిపోయాడు.. కన్నకూతురిని బెదిరించి ఆరు నెల‌లుగా అత్యాచారం చేశాడు.. చివ‌ర‌కు ఆ బాలిక గ‌ర్భ‌వ‌తి కావ‌డంతో విష‌యం వెలుగు చూసిన ఘ‌ట‌న విశాఖ జిల్లాలో జ‌రిగింది. 

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలోని అప్పన్నపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. కామ‌వాంఛ‌కి క‌న్న‌కూతురినే బ‌లిచేశాడు.. వావీవరసలు మరచి కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆరు నెల‌లుగా ఆమెపై ప‌డి ప‌శువాంఛ తీర్చుకున్నాడు.. క‌న్న తండ్రి చేతిలో లైంగిక దాడికి గురైన బాధితురాలు గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. విష‌యం తెలుసుకున్న బంధువులు.. కీచ‌క తండ్రిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.