‘బెల్ బాటమ్’వల్ల ‘ఫాస్ట్ అండ్ ప్యూరియస్’సీక్వెల్ ఆలస్యం

‘బెల్ బాటమ్’వల్ల ‘ఫాస్ట్ అండ్ ప్యూరియస్’సీక్వెల్ ఆలస్యం

ఇప్పుడు హాలీవుడ్ కు ఇండియా వెరీ ఇంపార్టెంట్ మార్కెట్! యూఎస్, యూకే తరహాలో మన దేశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ‘ఫాస్ట్ అండ్ ప్యూరియస్’ సీక్వెల్ నెల రోజుల వరకూ వాయిదా పడింది! ఆలస్యానికి కారణం... ఒక విధంగా... మన బాలీవుడ్ సినిమా! ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 : ద ఫాస్ట్ సాగా’... డ్వెయ్న్ ‘ద రాక్’ జాన్సన్, విన్ డీజిల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన మచ్ అవెయిటెడ్ సీక్వెల్. అయితే, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంఛైజీకి ఫ్యాన్స్ అయిన కోట్లాది మంది ఎదురుచూస్తోన్న తాజా చిత్రం ఇప్పటికే ఆలస్యమైంది. 2020లో రావాల్సిన ‘ఎఫ్‌ 9’2021లోనూ ఇంకా రాలేదు. అయితే, ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లు తెరుచుకుంటూ ఉండటంతో... అలాగే, ఇండియాలోనూ పెద్ద తెరపై ఇప్పుడు పెద్దగా ఆంక్షలు లేకపోవటంతో... హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ జనం ముందుకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. కాకపోతే, ముందుగా అనుకున్న దానికంటే దాదాపు నెల రోజులు ఆలస్యం మాత్రం తప్పటం లేదట...ఇటు ఇండియాలోని మార్కెట్ ను, అటు వరల్డ్ వైడ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’లెటెస్ట్ సీక్వెల్ మేకర్స్ జూన్ వరకూ తమ సినిమాని వాయిదా వేశారు. గతంలో మే 28న సినిమాని బాక్సాఫీస్ వద్దకి తెద్దామని భావించారు. కానీ, ఇప్పుడు జూన్ 25న ‘ఎఫ్‌ 9’రాబోతోంది. దీని వెనుక ‘యూనివర్సల్ పిక్చర్స్’వారి వ్యూహం ఏంటోగానీ.... ఇండియాలో మాత్రం పెద్ద బాక్సాపీస్ క్లాష్ తప్పినట్టైంది. మే 28న అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’మూవీ రాబోతోంది. అదే రోజు ‘ద ఫాస్ట్ సాగా’కూడా జనం ముందుకొస్తే కొంత డ్యామేజ్ తప్పదు. ‘బెల్ బాటమ్’, ‘ఎఫ్‌ 9’చిత్రాల మధ్య ఆడియన్స్ డివైడ్ అవుతారు. ఇప్పుడు ఆ బాక్సాపీస్ బ్యాటిల్ అవసరం లేకుండా జూన్ 25న వస్తోంది హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్. ఎనీ వే... ‘ఎఫ్ 9’ఎంత వసూలు చేస్తుందో, ‘బెల్ బాటమ్’ఎంత కలెక్ట్ చేస్తుందో... లెట్స్ వెయిట్ అండ్ సీ!