రైతుల పార్లమెంట్ మార్చ్ వాయిదా?
జనవరి 26 వ తేదీన రైతులు ఢిల్లీలో ట్రాక్టర్లతో ర్యాలీని నిర్వహించారు. అయితే, ఈ ర్యాలీ హింసాత్మతకు దారితీసింది. నిర్ణయించిన దారిలో కాకుండా, రైతుల ట్రాక్టర్లు వేరే దారిలో పయనించడం వలన హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎర్రకోటను ముట్టడించడంతో దేశం యావత్తు షాక్ అయ్యింది. దాదాపుగా 60 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనలు ఒక్కరోజు హింసాత్మక ఘటనతో పూర్తిగా మారిపోయింది. రైతులు చేసిన పనిపై విమర్శలు వస్తున్నాయి. అయితే, రైతుల ఆందోళనలో కొన్ని శక్తులు ప్రవేశించి ఆందోళనలు తప్పుదారి పట్టించారని రైతు సంఘాలు చెప్తున్నాయి. అయితే, గతంలో పార్లమెంట్ సమావేశాల సమయంలో ఫిబ్రవరి 1 వ తేదీన పార్లమెంట్ మార్చ్ ను నిర్వహించాల్సి ఉన్నా, రిపబ్లిక్ డే రోజున జరిగిన ఘటనతో ఆ నిర్ణయాన్ని రైతు సంఘాలు వాయిదా వేసుకున్నాయి. మహాత్మాగాంధీ వర్ధంతి రోజైన జనవరి 30 వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన దీక్షలు చేయాలని రైతులు నిర్ణయించారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)