వానమ్మా రావొద్దమ్మా...!

వానమ్మా రావొద్దమ్మా...!

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దాంతో రైతన్నలు వానమ్మా..ఇక రావద్దమ్మా అంటున్నారు. కురుస్తున్న భారీ వర్షాలతో చాలా ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల కారణంగా వాన నీరు చేలల్లో నిలిచిపోయి సొయా పంట వేసిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి, పత్తి పంటలు వేసిన రైతులు సైతం తీవ్రంగా నష్టపోయారు. నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరి పంట పూర్తిగా దెబ్బ తిన్నది. నెల్లూరు జిల్లాలో పెన్నానది ఉగ్రరూపం దాల్చింది. సోమశిల జలాశయం నిండిపోవడంతో గేట్లు ఎత్తివేశారు. కర్నూలు జిల్లాలో వాగులు పొంగి పొర్లుతుండటంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెన్నానది కి వరద ఉదృతి ఎక్కువగా ఉంది దాంతో రిజర్వాయర్ కు ఉన్న గేట్లు ఎత్తివేశారు. అనంతపురం జిల్లాలో పలు గ్రామాల్లో భారీ వర్షాలు కురిసాయి. దాంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు తెగిపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని అనేక ప్రాజక్టుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో సందర్శకులు చేరుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రాజక్టుల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.