రైతన్నకు ఒళ్లు మండింది...

రైతన్నకు ఒళ్లు మండింది...

లాక్‌డౌన్‌ నుంచి వ్యవసాయ పనులకు, రైతన్నలకు మినహాయింపు ఉందని ప్రభుత్వాలు చెబుతున్నా.. కొన్ని ప్రాంతాల్లో వాళ్లకు ఇబ్బందులు తప్పడంలేదు.. లాక్‌డౌన్‌ కారణంగా పంటలకు గిట్టుబాటు ధరలేక, కొనేవాళ్లు రాక రైతులు భారీగా నష్టపోతున్నారు. కూరగాయల రైతుల పరిస్థితీ ఇంతే దయనీయంగా ఉంది. కడప జిల్లా గొల్లపల్లి గ్రామంలో కూరగాయలు అమ్ముకునే వీలు లేకపోవడంతో రైతులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. నడిరోడ్డుపైనే కూరగాయలు వదిలేసి వెళ్లిపోయారు. రైతుల సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రోడ్డుపై ఉంచి కూరగాయలు అమ్ముకుంటే ఎంతో కొంత ధర లభించేదని, పోలీసులు దానికి కూడా అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అంతే కాదు.. రోడ్డుపై కూరగాలు పారబోసి నిరసన వ్యక్తం చేశారు. మద్యంషాపులకు అనుమతి ఇస్తారు.. కానీ, మాకు అనుమతి లేదా అంటూ మండిపడ్డారు రైతులు.