అర్జున్ టెండూల్కర్ కు మద్దతుగా ఫర్హాన్ అక్తర్...
కెరీర్ మొదలు పెట్టకముందే...అనుచిత వ్యాఖ్యలతో అర్జున్‌లోని ఉత్సాహాన్ని చంపేయొద్దన్నాడు బాలీవుడ్ నటుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్. యువ క్రికెటర్ అర్జున్ తెండూల్కర్‌పై ఆశ్రిత పక్షపాతం వ్యాఖ్యలు రావడం బాధాకరమన్నారు. ఐపీఎల్‌కు అతడు ఎంపికవ్వడంపై బంధుప్రీతి వంటి వ్యాఖ్యలు చేయడం క్రూరమన్నాడు. మేమిద్దరం తరచూ ఒకే జిమ్‌లో కసరత్తులు చేస్తుంటామని.... దేహదారుఢ్యం కోసం శ్రమించే తీరు, మెరుగైన క్రికెటర్ అవ్వాలన్న దృష్టి అతడిలో కనిపిస్తుందంటూ ట్వీట్ చేశాడు. ఇక తాజాగా తనను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడం పై అర్జున్ స్పందిస్తూ... టీమ్‌లో జాయిన్ అవ్వడానికి ఆత్రుతతో ఎదురు చూస్తున్నానని అన్నాడు అర్జున్ టెండూల్కర్. ఐపీఎల్ ప్రారంభం నుంచి తాను ముంబై ఇండియన్స్‌కు వీరాభిమానినన్న అతడు... తనను నమ్మి జట్టులోకి తీసుకున్న జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. ముంబై టీం జెర్సీ ధరించేందుకు ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్నానని అర్జున్ టెండూల్కర్ చెప్పాడు. అయితే ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో అర్జున్ను 20 లక్షలతో ముంబై టీం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)