బాయికాట్ చైనా పోయి బాయికాట్ ఐపీఎల్ వచ్చింది... 

బాయికాట్ చైనా పోయి బాయికాట్ ఐపీఎల్ వచ్చింది... 

జూన్ లో భారత్-చైనా మధ్య లడఖ్ యొక్క గాల్వన్ లోయలో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో 21 మంది భారతీయ సైనికులు అమరవీరులు అయ్యారు. అయితే అప్పటి నుండి ''బాయికాట్ చైనా'' అనే నినాదం భారత్ లో మారుమోగుతోంది. కానీ ఐపీఎల్ కు ''వివో'' అనే ఒక చైనా ఫోన్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ స్పాన్సర్షిప్ చేస్తుంది. అందువల్ల ఆ స్పాన్సర్షిప్ ను తొలగించాలంటూ ప్రజలు బీసీసీఐ ని కోరారు. దానికి చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా మద్దతు పలికాడు.

కానీ నిన్న జరిగిన ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో స్పాన్సర్షిప్ విషయం లో ఎటువంటి మార్పు ఉండదు. 2022 వరకు వివో నే ఐపీఎల్ స్పాన్సర్ అని తేల్చేసింది బీసీసీఐ. ఇక అప్పటి నుండి భారత  ప్రజలు బాయికాట్ చైనా అనే నినాదాన్ని వదిలేసి బాయికాట్ ఐపీఎల్ అనే నినాదాన్ని అందుకున్నారు. బీసీసీఐ కి దేశంతో కంటే డబ్బే ముఖ్యం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది కేవలం ఒక వ్యాపారం మాత్రమే, మిమ్మల్ని చూసి సిగ్గు పడుతున్నాము అని ట్విట్టర్ లో బీసీసీఐ ని ఏకిపారేస్తున్నారు. అంతకముందు బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్ మాట్లాడుతూ... వివో స్పాన్సర్షిప్ వలన మనకే లాభం కలుగుతుంది అందువల్ల దానిని తొలగించడం కుదరదు అని తెలిపాడు. మరి ఇప్పుడు బాయికాట్ ఐపీఎల్ పై హర్భజన్ ఏమైనా స్పందిస్తాడో చూడాలి.